Skip to content

మీ ఆనందానికి, అభివృద్ధికి హామీ భూమి

వేలాది మంది సొంత ఇంటి కలలకి వాస్తవ రూపాన్నిచ్చి రియల్ఎస్టేట్ రంగంలో నమ్మకానికి ప్రతిరూపంగా నిలిచిన సంస్థ MATSYA. వినియోగదారుల ఆకాంక్షలకి చక్కని రూపునిస్తూ, అభివృద్ధి చెందిన ప్రదేశాలలో వెంచర్లను నిర్మిస్తూ, ప్రతి ఒక్కరి ప్రశంసలను అందుకొంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో వ్యాపార, నిర్మాణ రంగాలలో శరవేగంగా విస్తరిస్తున్న నగరం కర్నూలు. నగరానికి సమీపంగా నన్నూర్ లో సకల సదుపాయాల నడుమ MATSYA అందిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భూమి. నన్నూర్ సమీపంలో ప్రభుత్వ భూములు అధికంగా వుండటం వలన భవిష్యత్తులో అనేక ప్రభుత్య కార్యాలయాలు ఇక్కడ కొలువు తీరుతాయనటంలో ఆశ్యర్యం లేదు. దీంతో పాటు ఆసియాలోని అతి పెద్ద సోలార్ ప్లాంట్, APIIC (ఇండస్ట్రియల్ హబ్), DRDO లాంటి సంస్థలు, విమానాశ్రయంతో పాటు అతి చేరువలో స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ తో ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రతిరూపంలా నిలుస్తోంది.
MATSYA ఏ నిర్మాణం చేపట్టినా సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. ఎంట్రన్స్ ఆర్చ్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, డ్రైనేజ్, మొక్కల పెంపకం లాంటి మరెన్నో సౌకర్యాలతో మీ అభివృద్ధికి, మీ ఆనందానికి నిలువెత్తు ప్రతిరూపంలా నిలుస్తోంది భూమి.

Matsya Infra